ఏ అంశం మీద అయినా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో వర్మ నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. ఫ్రెండ్షిప్ డే గురించి వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రెండ్స్ ప్రతి రోజు హాగ్(కౌగిలింత) చేసుకుంటారు. ఫ్రెండ్షిప్ డే రోజున హాగ్ చేసుకోవడంలో వింత ఏముంది..? ఒకవేళ హాగ్ చేసుకోకుండా ఇంకేం చేసుకుంటారు..?
‘ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య శృంగారం(సెక్స్) లేకుండా స్నేహితులుగా ఉండగలరా..? ఒకవేళ నేను అమ్మాయి అయితే ఎవరైనా అబ్బాయి శృంగారం ఆశించకుండా కేవలం నాతో స్నేహం(ఫ్రెండ్షిప్) చేయాలని అనుకుంటే నాకు చాలా అవమానం జరిగినట్టు భావిస్తాను. ‘ అని సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
వర్మ ఉద్దేశ్యంలో అమ్మాయి, అబ్బాయి కేవలం శృంగారం కోసం మాత్రమె స్నేహం చేస్తారా..?



