గ్లామర్ పాత్రలకి ఫుల్ డిమాండ్ ఉన్న రోజుల్లో కూడా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న నటి స్నేహ. పెళ్లి చేసుకున్నాక నటనకు దూరమైనా స్నేహ ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన ‘ఉలవచారు బిర్యాని’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమాలో స్నేహ నటనకి అటు విమర్శకుల నుంచి, ఇటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో తన వయసు కన్నా ఎక్కువ ఉన్న పాత్ర చేసారు. ఈ పాత్ర చేయడానికి గల కారణం ఏంటని స్నేహాని అడిగితే ‘నాకు కథ నచ్చితే చాలు, నా పాత్ర వయసు ఎక్కువైనా నేను సినిమా చేస్తాను. 34 లేదా 36 వయసు పాత్రైనా మంచి గుర్తింపు తెస్తుంది అంటే అస్సలు వదులుకోను. కానీ గ్లామర్ పాత్రలకి మాత్రం దూరంగా ఉంటాను. ఎందుకంటే నేను చేసే సినిమాలు నా ఇంటిల్లిపాది చూసేలా ఉండాలని’ సమాధానం ఇచ్చింది.


