ఇదే నిజమైతే ప్రభాస్ రూటు మార్చినట్టే..!

Published on Aug 13, 2020 7:02 am IST

ప్రస్తుతానికి మన టాలీవుడ్ డార్లింగ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రెండు భారీ ప్రాజెక్టులను తన లైనప్ లో పెట్టుకున్నారు. ఇక వీటి తర్వాత మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయనున్నారని టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.

అయితే ఈ నేపథ్యంలో ఓ అంశాన్ని మనం గమనించాల్సి ఉంది. బాహుబలి మినహా ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఏ స్టార్ దర్శకునితో కూడా సినిమా కమిట్ అవ్వలేదు. కేవలం యంగ్ టాలెంట్ నే ప్రోత్సహిస్తూ తన స్టార్డం ను వారిపై నమ్మకం ఉంచి ఇచ్చారు.

ఇది సాధారణ అంశం అయితే కాదు. అలా ఇప్పటికే ముగ్గురు దర్శకులకు ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో వినిపిస్తున్న ప్రాజెక్ట్ ఒకే అయితే రూటు మార్చినట్టే అని చెప్పాలి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యాక కూడా మళ్లీ యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More