ఐఫా అవార్డ్స్ 2019: బెస్ట్ హీరో, హీరోయిన్ ఎవరంటే..?

Published on Sep 19, 2019 3:34 pm IST

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2019 వేడుక నిన్నముంబైలో ఘనంగా ప్రారంభమైంది. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ తారలు ఈ వేదికపై సందడి చేశారు. కాగా ఏడాదికి గాను ఐఫా బెస్ట్ హీరో గా రణ్వీర్ సింగ్ ఎంపిక కబడ్డారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ చిత్రంలో ఆయన పోషించిన అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రకు గాను ఆయన ఈ అవార్డుని అందుకున్నారు. ఇక బెస్ట్ హీరోయిన్ గా అలియా భట్ ఎంపికయ్యారు. ‘రాజి’ చిత్రంలో ఆమె నటనకు గాను ఈ అవార్డు ఆమెను వరించింది.

ఇక బెస్ట్ మూవీ గా ‘రాజి’ నిలువగా, బెస్ట్ డైరెక్టర్ అవార్డు శ్రీరామ్ రాఘవన్ ‘అంధాదున్’ చిత్రానికి అందుకున్నారు. ఇక బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డ్స్ ‘పద్మావత్’ చిత్రంలో నటించిన అదితిరావ్ హైదరి, ‘సంజు’ చిత్రానికి విక్కీ కౌశల్ గెలుచుకోవడం జరిగింది. ఇక బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఇషాన్ కట్టర్ ‘దఢక్’ చిత్రం కొరకు, సనా అలీ ఖాన్ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా కేదార్ నాధ్ చిత్రానికి అవార్డులు గెలుపొందారు.

సంబంధిత సమాచారం :

X
More