ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే ఆల్-టైమ్ రికార్డ్: 21 ఏళ్ల విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ప్యాకేజీ!

ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే ఆల్-టైమ్ రికార్డ్: 21 ఏళ్ల విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ప్యాకేజీ!

Published on Jan 2, 2026 12:15 PM IST

IIT Hyderabad

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Hyderabad)కి చెందిన ఓ విద్యార్థి అద్భుతమైన రికార్డు సృష్టించాడు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ( Edward Nathan Varghese )అనే 21 ఏళ్ల యువకుడు, తన ప్రతిభతో ఏకంగా రూ. 2.5 కోట్ల భారీ వార్షిక ప్యాకేజీని సొంతం చేసుకున్నాడు. 2008లో ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభమైనప్పటి నుండి, ఇదే ఇప్పటివరకు నమోదైన ‘Highest Package’ కావడం విశేషం.

నెదర్లాండ్స్ కంపెనీ నుండి బంపర్ ఆఫర్

నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ Optiver, ఎడ్వర్డ్‌కు ఈ ఆఫర్ ఇచ్చింది. ఆయన జూలై నెలలో నెదర్లాండ్స్‌లోని ఆఫీసులో Software Engineer గా జాయిన్ కానున్నారు. గతంలో ఐఐటీ హైదరాబాద్‌లో అత్యధిక ప్యాకేజీ సుమారు రూ. 1.1 కోట్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు ఎడ్వర్డ్ ఆ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర లిఖించాడు.

ఇంటర్న్‌షిప్ నుండే అవకాశం

ఈ జాబ్ ఆఫర్ సాధారణ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా రాలేదు. ఎడ్వర్డ్ ఈ కంపెనీలో రెండు నెలల పాటు సమ్మర్ Internship పూర్తి చేశాడు. అక్కడ ఆయన పనితీరు నచ్చడంతో, కంపెనీ ఆయనకు ‘Pre-Placement Offer’ (PPO) ఇచ్చింది. ఇంటర్న్‌షిప్ సమయంలో కేవలం రెండు వారాల ట్రైనింగ్ తర్వాత ఒక ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేయడంతో, ఈ జాబ్ ఆయన సొంతమైంది.

చిన్నప్పటి నుంచే కోడింగ్‌పై ఆసక్తి

ఎడ్వర్డ్ పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా, 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బెంగళూరులో చదువుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ ఇంజనీర్లే. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే తనకు Coding మరియు కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్‌పై ఆసక్తి ఉండేదని ఎడ్వర్డ్ తెలిపాడు. “ఐఐటీ ట్యాగ్ మరియు ఇక్కడి ఫ్లెక్సిబుల్ కరిక్యులమ్ నాకు ఎంతో హెల్ప్ అయ్యాయి,” అని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.

పెరిగిన ప్లేస్‌మెంట్స్ జోరు

కేవలం ఎడ్వర్డ్ మాత్రమే కాదు, ఈ ఏడాది ఐఐటీ హైదరాబాద్‌లో ప్లేస్‌మెంట్స్ చాలా బాగున్నాయి. ఈ సీజన్‌లో సగటు ప్యాకేజీ (Average Package) కూడా భారీగా పెరిగి రూ. 36.2 లక్షలకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 75 శాతం ఎక్కువ. మరో కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి కూడా రూ. 1.1 కోట్ల ఆఫర్ రావడం విశేషం. ప్రస్తుతం మార్కెట్‌లో జాబ్ హైరింగ్ కాస్త నెమ్మదిగా ఉన్నా, ఐఐటీ విద్యార్థులు మాత్రం తమ సత్తా చాటుతున్నారు.

తాజా వార్తలు