చెన్నై వరద బాధితులకు అండగా నిలబడ్డ ఇళయరాజా

చెన్నై వరద బాధితులకు అండగా నిలబడ్డ ఇళయరాజా

Published on Dec 4, 2015 12:42 PM IST

ilayaraja

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన బాణీతో దేశంలోని అద్భుతమైన సంగీత దర్శకుల్లో ఒకరుగా స్థానం సంపాదించుకున్న ఆయన, తన సంగీతం ద్వారా మాత్రమే కాక సామాజిక కార్యక్రమాలతోనూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తాజాగా చెన్నై నగరాన్ని వణికిస్తోన్న భారీ వరదల వల్ల బాధితులైన అంధ విద్యార్థులకు ఆహార, వైద్య సదుపాయాలు కల్పించేందుకు స్వయంగా ఇళయరాజాయే ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యపరచింది.

72 ఏళ్ళ వయసులో ఆయన చెన్నైలోని ఓ అంధ విద్యార్థుల పాఠశాలకు స్వయంగా ఓ పడవను ఏర్పాటు చేసుకొని వెళ్ళి వారికి ఆహార, వైద్య సదుపాయాలు అందించారు. ఇళయరాజా స్వయంగా రావడంతో అక్కడి వారంతా మరింత ఉత్తేజంతో సహాయ కార్యక్రమాల్లో భాగం అయ్యారు. ఇక ఇళయరాజా లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు పలువురు టాప్ స్టార్స్ చెన్నై నగరం కోసం తమ వంతు సహాయం చేస్తూ ముందుకు రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

తాజా వార్తలు