ప్రముఖ సంగీత దర్శకుడు, మాస్ట్రో ఇళయరాజా ఈ రోజు రాత్రి ముంబైలో జరిగే ఓ కార్యక్రమంలో లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. 1000 సినిమాలకు సంగీతం అందించిన సందర్భంలో ఈ వేడుక జరగనుంది. అమితాబ్ బచ్చన్, ధనుష్ నటించిన ‘షమితాబ్’ చిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా స్వరపరిచిన చిరస్మరణీయమైన సుమధుర బాణిలను మరోసారి గుర్తు చేయనున్నారు. ఇదే వేదికపై ‘షమితాబ్’ ఆడియోను విడుదల చేయనున్నారు.
అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, కమల్ హాసన్, శ్రుతి హాసన్ తదితర ప్రముఖులు ఈ లైవ్ కన్సర్ట్ కు హాజరుకానున్నారు. ముంబైలో లైవ్ కన్సర్ట్ తర్వాత చెన్నై, ఢిల్లీ నగరాలలో కూడా ఇళయరాజా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత బాల దర్శకత్వం వహిస్తున్న ‘తారై తప్పట్టై’ సినిమా ఇళయరాజా సంగీతం అందించిన 1000వ సినిమా.


