ఇళయ దళపతి విజయ్ ‘వరిసు’ సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

ఇళయ దళపతి విజయ్ ‘వరిసు’ సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

Published on Dec 2, 2022 6:51 PM IST

కోలీవుడ్ స్టార్ నటుడు ఇలయ దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వరిసు. మన తెలుగులో వారసుడు గా రిలీజ్ కానున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు దీనిని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ రంజితమే అందరినీ ఆకట్టుకుని యూట్యూబ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకోగా నేడు సెకండ్ సాంగ్ కి సంబందించిన అప్ డేట్ ని కూడా అందించారు వరిసు మేకర్స్.

#TheeThalapathy అనే పల్లవితో సాగే ఈ సాంగ్ ని డిసెంబర్ 4 న సాయంత్రం 4 గం. లకు రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ తెలిపింది. మంటల మధ్య చెస్ గేమ్ లో కింగ్ ని ప్రతిబింబించేలా యూనిట్ రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రీ లుక్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరొక రెండు రోజులు ఆగాలి. కాగా వరిసు మూవీని 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు