ఇలియానా ఎక్కువ ఊహించుకుందా !

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ చిత్రీకరణను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది. కాగా ఈ స్పెషల్ సాంగ్ లో నటించడానికి చిత్రబృందం మొదటిగా ‘ఇలియానా’ని సంప్రదించిందట.

అయితే సాంగ్ లో నటించడానికి ఒప్పుకున్నా ఈ గోవా బ్యూటీ, తనని తానూ ఎక్కువ ఉహించుకొని రెమ్యూనిరేషన్ని భారీ మొత్తంలో డిమాండ్ చేసిందట. దాదాపు ఒక్క సాంగ్ కోసమే 65 లక్షలు అడిగిన్నట్లు తెలుస్తోంది. దాంతో చిత్రబృందం ఇక మళ్ళీ ఆమెను సంప్రదించలేదట.

కాగా ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

Exit mobile version