దసరా కానుకగా రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినప్పటికీ బాక్స్ ఆఫీసు వద్ద మాత్రం లాంగ్ రన్ లో 40 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది. ప్రస్తుతం హాలిడే కోసం యుఎస్ వెళ్ళిన రామ్ చరణ్ తిరిగి రాగానే తన తదుపరి సినిమా తని ఒరువన్ రీమేక్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అవుతాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ పవర్ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలో రామ్ చరణ్ సరనస జోడీ కట్టే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు.
ఇప్పటికే కాజల్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ తాజాగా మరో స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఒకప్పుడు తన ఒంపు సొంపులతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించిన గోవా బ్యూటీ ఇలియానా. చరణ్ సినిమాలో హీరోయిన్ ది కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో సురేందర్ రెడ్డి ఇలియానా అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందని తనతో చర్చలు జరుపుతున్నాడు. ఈ ఆఫర్ విషయంలో ఇలియానా కూడా సముఖంగానే ఉంది. రామ్ చరణ్ యుఎస్ నుంచి తిరిగి రాగానే ఈ విషయంఫై ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు. హీరోయిన్ తో పాటు చరణ్ కి పోటీని ఇచ్చే విలన్ పాత్ర కోసం కూడా పలువురు స్టార్ హీరోస్ ని పరిశీలిస్తున్నారు.


