రవితేజ సినిమాలో కనిపించబోతున్న ఇలియానా?

Published on Aug 16, 2021 9:00 pm IST

మాస్ మహారాజ రవితేజ ఇలియాన కాంబినేషన్ గురుంచి పెద్దగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేష‌న్‌లో కిక్, దేవుడు చేసిన మ‌నుషులు, అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోనీ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకుల్లో వీరి కాంబోపై మంచి మార్కులే ఉన్నాయి. తాజాగా ర‌వితేజ‌ ఇలియానా నాలుగో సారి జ‌త క‌ట్టేందుకు సిద్ధ‌మైన‌ట్టు సమాచారం. అయితే రవితేజ సరసన హీరోయిన్‌గా కాకుండా ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలోని ఓ స్పెష‌ల్ సాంగ్‌లో కనిపించబోతుందని టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇలియానాతో స్పెష‌ల్ సాంగ్ చేయించాల‌ని భావించిన మేకర్స్, ఇప్ప‌టికే ఆమెతో చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్టు ప్ర‌చారం జరుగుతుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మ‌జిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌తో పాటు రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :