ఫుల్ స్వింగ్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్!

ఫుల్ స్వింగ్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్!

Published on Mar 8, 2026 9:00 PM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోయిన్స్ శ్రీలీల అలాగే రాశిఖన్నా కాంబినేషన్లో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మాస్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. మంచి బజ్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా ఓ వారం ముందే థియేటర్స్ లో సందడి చేయనుంది. దీనితో అన్ని పనులు మరింత ముందుకు రావాల్సి వస్తుంది. ఇలా మేకర్స్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో ప్లాన్ చేస్తున్నారు.

ఆల్రెడీ హరీష్ ఇంటర్వ్యూ లాంటివి మొదలు పెట్టగా హీరోయిన్ శ్రీలీల కూడా ఆఫ్ లైన్ లో మొదలు పెట్టారు. ఇలా ఫుల్ స్వింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కొనసాగుతుంది. అలాగే ట్రైలర్ లాంచ్ ఇంకా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లు కూడా బాకీ ఉన్నాయి. ఇవెప్పుడు ఉంటాయో చూడాలి.ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మరియు థమన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ మార్చ్ 19న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

తాజా వార్తలు