గోవా బ్యూటీ ఇలియానా గత మూడు సంవత్సరాలుగా టాలీవుడ్ కి దురమయ్యి హిందీ సినిమాలు చేసుకుంటుంది. అయితే ఆమె గత బాలీవుడ్ వెంచర్ ‘హ్యాపీ ఎండింగ్’ నిరాశపరచడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ భామ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో వుందంట. బర్ఫీ సినిమాతో విజయంసాధించి ఆ పైన కొన్ని ఆఫర్లు సంపాదించినా అవి కాస్తా వృధాగా మారడంతో తెలుగు సినిమా వైపు దృష్టిసారించినట్టు తెలుస్తుంది. అంతేకాక ఒక పెద్ద హీరో సినిమాలో ఐటెం సాంగ్ కి శాతం సై అందని సమాచారం.


