రొమాన్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ రెండిటికి హామీ ఇస్తున్న ‘సమ్మోహనం’ !

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. టీజర్ తోనే అందరిలోనూ ఆసక్తిని రేపిన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ట్రైలర్ కూడ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది. ఉత్తరాది హీరోయిన్ కు, తెలుగు అబ్బాయికి మధ్యన జరిగే ఈ ప్రేమ కథలో హెల్తీ రొమాంటిక్ డోస్ ఎక్కువగానే ఉంది.

దాంతో పాటు మంచి ఎంటర్టైన్మ్నెట్ కూడ సినిమాలో ఉంటుందని ట్రైలర్లోని నరేష్, రాహుల్ రామకృష్ణ వంటి నటుల పాత్రల్ని చూస్తే అర్థమవుతోంది. ఇక ప్రేమకు ముఖ్యమైన ఎమోషన్ కూడ కథలో సరిపడినంత ఉన్నట్టు కనిపిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి కథానాయకిగా కనిపిస్తోంది. జూన్ 15న విడుదలకానున్న ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి :

Exit mobile version