ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో సినిమా ఐనా ప్రచారం అనేది చాలా అవసరం. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి హైప్ క్రియేట్ చేసినప్పుడే భారీ ఓపెనింగ్స్ అలాగే వసూళ్లు రాబట్టే అవకాశం ఉంటుంది. అందుకే చిత్ర విడుదలకు ముందే టీజర్స్, ట్రైలర్స్ విడుదల చేయడం ద్వారా మూవీపై ప్రేక్షకులలో ఆసక్తికలిగేలా చేస్తున్నారు. ఇక మహేష్ నటించిన సంక్రాంతి సినిమా సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదలైన యూ ట్యూబ్ లో నయా రికార్డ్స్ క్రియేట్ చేసింది.
కాగా రేపు డిసెంబర్ నుండి మహేష్ పాటలతో హోరెత్తించనున్నారు. ప్రతి సోమవారం సరిలేరు నీకెవ్వరు మూవీ నుండి ఒక అప్డేట్ వస్తుందని ఇప్పటికే సమాచారం ఉండగా నేడు అధికారంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. డిసెంబర్ నెలలో మొత్తం ఐదు సోమవారాలుండగా ప్రతి సోమవారం ఒక సాంగ్ విడుదల చేయనున్నారట. అంటే డిసెంబర్ 2వ తారీఖున మొదటి సాంగ్ రానుందన్నమాట. ఈ ప్రకటనతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. దేవిశ్రీ మరో మారు మహేష్ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.
