లైఫ్’లో గొప్ప మూమెంట్ – వారసుడు వచ్చిన వేళ ఎన్టీఆర్

లైఫ్’లో గొప్ప మూమెంట్ – వారసుడు వచ్చిన వేళ ఎన్టీఆర్

Published on Jul 22, 2014 6:10 PM IST

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమితానందంలో ఉన్నాడు. ఈ రోజు, జూలై 22 ఉదయం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త తెలియగానే నందమూరి అభిమానులు అనందంలో మునిగిపోయారు. వారసుడు వచ్చిన వేళ ఎన్టీఆర్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.

‘ఈ రోజు నాకు కొడుకు పుట్టాడు. ఇంత కంటే గొప్ప మూమెంట్ లైఫ్ లో మరొకటి ఉంటుందని అనుకోవడం లేదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, రామారావు గారు మళ్లీ పుట్టలేదని. ఇప్పుడు అదే చెప్తాను, రామారావు గారు మళ్లీ పుట్టలేదు. ఆయన ఒక్కరే. ఆయన తర్వాత మళ్లీ ఎవరూ పుట్టలేదు.’ అని ఎన్టీఆర్ అన్నారు.

కుమారుడు పుట్టిన సంతోషంలో చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ట్విట్టర్లో తిరిగి అడుగుపెట్టారు. తన ఆనందాన్ని ట్విట్టర్ కుటుంబంతో పంచుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు