అక్కడ బాహుబలి రికార్డుని బ్రేక్ చేసిన సాహో

Published on Sep 15, 2019 2:44 pm IST

తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల సాహో పరిస్థితి అంత ఆశాజనకంగా లేనప్పటికీ నెల్లూరులో మాత్రం రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది. నెల్లూరులో సాహో వసూళ్ల ప్రభంజనం కొనసాగుతుంది. సాహో నెల్లూరు జిల్లాలో 16వ రోజున 1,85,796 రూపాయల షేర్ సాధించిన మొత్తంగా ఇప్పటివరకు 4,30,50,033 రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి బాహుబలి 1 పేరిట ఉన్న 4.30 కోట్ల రికార్డుని అధిగమించింది. ఐతే నెల్లూరులో అత్యధిక షేర్ సాధించిన చిత్రంగా బాహుబలి 2 టాప్ లో కొనసాగుతుంది.

బాహుబలి2, సాహో, బాహుబలి, రంగస్థలం, ఖైదీ 150 టాప్ ఫైవ్ షేర్ సాధించిన చిత్రాలుగా నెల్లూరులో నిలిచాయి. ఐతే సాహో మొదటిరోజు ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా బాహుబలి 2 చిత్రాన్ని కూడా దాటేసి మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. ఇక కొత్త చిత్రాల రాకతో సాహో వసూళ్లకు ముఖ్యంగా తెలుగులో బ్రేక్ పడవచ్చు.

సంబంధిత సమాచారం :

More