ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆసక్తికరమైన వార్త !

Published on Aug 23, 2018 1:41 am IST

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ చిత్రంలో ఎవ్వరికి తెలియని ఎన్టీఆర్ గారి జీవితంలో జరిగిన పలు ఆసక్తికరమైన అంశాలను చూపించనున్నారు. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ గారి బసవతారకమ్మగారి అనుబంధం ఒకటి. ఈ చిత్రంలో ఇదే విషయానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక సన్నివేశాలు కూడా ఉన్నాయని సమాచారం.

అయితే ఈ చిత్రం బసవతారకంగారి పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రివీల్ చేయనున్నారు. కాగా మూడు నెలల్లో టాకీ పార్ట్ పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా వినిపించారని అవి చాలా బాగా వచ్చాయని సమాచారం. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More