పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తో ప్లాన్ చేసిన చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. అపూర్వ ఇతిహాస గాథ రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అంచనాలు అనేకం. ప్రభాస్ ని బాహుబలి లాంటి ఒక పీరియాడిక్ సినిమాలో చూసినప్పుడే దాసోహం అయ్యిన ఇండియన్ బాక్సాఫీస్ అలాంటిది ఆదిపురుష్ లాంటి సినిమాలో ఏకంగా రాయునిగా చేస్తుండడం దేశ వ్యాప్తంగా కూడా సంచనలంగా మారింది.
మరి ఎన్నో అంచనాలతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదలకు ఈరోజు నుంచి సరిగ్గా ఏడాది ఉండడంతో ఈ చిత్రం పేరు ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ లోకి వచ్చేసింది. సరిగ్గా ఇదే ఆగస్ట్ 11న 2022 వ సంవత్సరంలో తమ భారీ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు ప్రకటన ఇవ్వడం జరిగింది. దీనితో ఇంకొక్క ఏడాదిలో ప్రభాస్ మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ బ్లాస్ట్ కి రెడీ అయ్యినట్టు అయ్యింది. మరి ఈ భారీ చిత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.
