2001 తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ 2021లో అలా..!

Published on Feb 20, 2020 1:32 pm IST

ఆర్ ఆర్ ఆర్ కారణంగా ఎన్టీఆర్ ఏకంగా రెండేళ్లు వెండి తెరకు దూరం అవుతున్నారు. ఈ విషయం ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని చాల నిరాశకు గురిచేసింది. మొదట్లో కేవలం 2019మాత్రమే ఎన్టీఆర్ మిస్సవుతారు అనుకుంటే, ఆర్ ఆర్ ఆర్ విడుదల 2021కి వాయిదాపడటంతో అది రెండేళ్లకు చేరింది. ఐతే నిన్న ఎన్టీఆర్ ప్రకటన వారి నిరీక్షణకు తగిన ఫలితం అందించింది. వచ్చే ఏడాది కేవలం రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలు ఎన్టీఆర్ విడుదల చేయనున్నాడు. ఆర్ ఆర్ ఆర్ 2021 జనవరి 8న విడుదల అవుతుండగా, త్రివిక్రమ్ తో నిన్న ప్రకటించిన మూవీ మార్చి నెలలో విడుదల కానుంది.

త్రివిక్రమ్ ఎన్టీఆర్ ల చిత్రం వచ్చే మే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. కాబట్టి షూటింగ్ త్వరిత గతిన పూర్తిచేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చికల్లా థియేటర్స్ లోకి వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నారు. 2001లో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఎన్టీఆర్ ఆ ఏడాది సెప్టెంబర్ 27న స్టూడెంట్ నంబర్ వన్, మరో రెండు నెలకు డిసెంబర్ 21న సుబ్బు చిత్రాన్ని విడుదల చేశారు. మళ్ళీ 2021లో ఇరవై ఏళ్ల తరువాత ఎన్టీఆర్ రెండు నెలల కాలంలో ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రమ్ మూవీతో వెంట వెంటనే రానున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More