చరణ్, శంకర్ ల ప్రాజెక్ట్ కు వీరిలో ఎవరైనా ఓకే అట.!

Published on May 25, 2021 8:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం అనంతరం మన ఇండియాలోనే మరో మోస్ట్ వాంటెడ్ దర్శకుడు శంకర్ తో సినిమాను ప్రకటించేసి మరింత హైప్ సెట్ చేసి పెట్టాడు.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అన్నదానిపై గత కొంత కాలం నుంచి మంచి బజ్ నడుస్తుంది. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం “RRR”లో చరణ్ సరసన నటిస్తున్న ఆలియా భట్ పేరు కూడా వినిపించగా దీనికి అభిమానుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ కూడా వస్తుంది.

అయితే ఈమె అనే కాకుండా చరణ్ లాస్ట్ చిత్రం వినయ విధేయ రామ లో నటించిన కియారా అద్వానీ అయినా ఓకే అన్న అభిప్రాయంలో అంతా ఉన్నారు. సో ఈ ఇద్దరి హీరోయిన్స్ లో ఎవరైనా ఓకే అని అభిమానులు చెప్తున్నారు. మరి ఎలాగో ఈ ఇద్దరు పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరిని ఓకే చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :