మన దేశంలో థియేటర్స్ తెరుచుకునే మొదటి ప్లేస్ ఇదే.?

Published on Sep 27, 2020 10:02 pm IST

దాదాపు ఏడు నెలల పూర్తి కావస్తుంది థియేటర్స్ లో సినిమా పడి ఊహించని విధంగా నెలకొన్న పరిస్థితులు మూలాన ఎన్ని రకాలుగా నష్టాలు ఉన్నాయో అన్ని చూసేసారు మన దేశస్థులు. ఎన్నో ఇష్టాలు కూడా దూరం పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వ అనుమతితో అన్నీ వ్యవస్థలు తెరిచుకుంటున్నాయి ఒక్క సినిమా థియేటర్స్ తప్ప.

దీనితో థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయా అని అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ మన దేశంలో ఇపుడు ఓ చోట మొదటిసారిగా తెరుచుకోనున్నాయట. అదే పశ్చిమ బెంగాల్ లో, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులో భాగంగా సామాజిక దూరం మరియు మాస్కులతో పాటుగా ఇతర జాగ్రత్తలతో ప్రేక్షకులను అనుమతించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అలా అన్ని సెట్ చేసి వచ్చే అక్టోబర్ 1 కల్లా థియేటర్ లను ఓపెన్ చెయ్యడానికి అక్కడ సన్నాహాలు చేస్తున్నారని ఇపుడు సమాచారం.

సంబంధిత సమాచారం :

More