ఈపాటికి “ఆచార్య” యుఫోరియా ఓ రేంజ్ లో ఉండేది.!

Published on May 13, 2021 6:21 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అన్ని బాగుండి ఉంటే ఈ పాటికి థియేటర్స్ లో ఆచార్య యుఫోరియా విట్నెస్ చేసి ఉండే వాళ్ళం అని మెగా ఫాన్స్ బాధ పడుతున్నారు.

కోవిడ్ పరిస్థితులు కనుక కంట్రోల్ లో ఉండి ఉంటే సరిగ్గా ఇదే రోజు మే 13న ఆచార్య విడుదల అయ్యి ఆ హంగామానే వేరేలా ఉంటుందని మెగా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో గుర్తు చేసుకుంటున్నారు. మొత్తానికి ఏం చేస్తాం సినిమా అయితే విడుదల లేదు.. అని అనుకొని కొత్త విడుదల తేదీ కోసం చూస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :