భారత్ ఫైనల్ మ్యాచ్ తో హాట్ స్టార్ వరల్డ్ రికార్డ్.!

Published on Nov 21, 2023 4:06 pm IST

గత కొన్ని రోజుల కితమే భారతీయులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ మ్యాచ్ లో దురదృష్టవశాత్తు భారత్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ పట్ల అనేక అంచనాలు కూడా ఉన్నాయి. దీనితో ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ లో రికార్డులు బద్దలగొడుతుంది అని అనుకున్నారు. దీనితో మత్క్జ్ స్టార్ట్ అయ్యిన కొద్ది లోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా భారతీయులు మ్యాచ్ ని చూసారు.

అయితే హాట్ స్టార్ వారు లేటెస్ట్ గా ఆరోజు నమోదు అయ్యిన వరల్డ్ రికార్డుని రివీల్ చేశారు. ఆ మ్యాచ్ లో తమ పీక్ స్టేజ్ లో హాట్ స్టార్ లో వ్యూస్ 59 మిలియన్ వ్యూవర్స్ చూసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ మ్యాచ్ ఓ సరికొత్త వరల్డ్ రికార్డు సెట్ చేసినట్టుగా హాట్ స్టార్ వారు అనౌన్స్ చేశారు. మరి ఈ రికార్డు అయితే మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్ అప్పుడే బ్రేక్ అవుతుంది అని చెప్పాలి. ఈ పీక్ టైం లో చాలా సినిమాల వసూళ్లకు కూడా గట్టి ప్రభావమే కనిపించింది.

సంబంధిత సమాచారం :