ఓటీటీలో భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్ కి సంచలన రెస్పాన్స్.. 140 కోట్ల జనాభాలో దాదాపు సగానికి పైగా చూసారు

ఓటీటీలో భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్ కి సంచలన రెస్పాన్స్.. 140 కోట్ల జనాభాలో దాదాపు సగానికి పైగా చూసారు

Published on Mar 9, 2026 7:00 AM IST

T20 World Cup 2026

నిన్న ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అనుకున్న టీ 20 వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు వార్ వన్ సైడ్ చేసేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మరి ఈ మ్యాచ్ ఓటీటీలో కూడా చరిత్ర సృష్టించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లు అన్నీ జియో హాట్ స్టార్ లోనే లైవ్ స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే అందులో రికార్డ్ వ్యూవర్ షిప్స్ ఈ లైవ్ కి దక్కినట్టు తెలుస్తోంది. భారత దేశంలో మొత్తం 148 కోట్ల జనాభా ఉంటే నిన్న ఒక్క జియో హాట్ స్టార్ లోనే 80 మిలియన్ కి పైగా వీక్షకులు చూసేసారు. అంటే ఇది సుమారు దేశ జనాభాకు పైమాటే అని చెప్పాలి. ఇది కేవలం ఓటీటీ వరకు అయితే టెలివిజన్ పై చూసినవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలా ఒక చారిత్రాత్మక విజయం అందుకున్న మ్యాచ్ కి అంతే రీతిలో రెస్పాన్స్ కూడా దక్కింది అని చెప్పాలి.

తాజా వార్తలు