భారతీయుడు 2 షూటింగ్ డిటైల్స్ !

Published on Dec 27, 2018 9:52 am IST

కమల్ హాసన్ – శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ తెరకెక్కనుందని తెలిసిందే. ఇక ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరిలో చెన్నైలో జరగనుంది. ఈ షెడ్యూల్ తరువాత పొల్లాచ్చి లో షూట్ జరిపి మిగిలిన చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు. చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ ను అక్కడే తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం కోసం యంగ్ లుక్ లో మారడానికి కమల్ ప్రస్తుతం జిమ్ లో కష్టపడుతున్నాడు.

అనిరుద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ కథానాయికగా నటించనుండగా 2020లో ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తరువాత కమల్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో బిజీ కానున్నారు.

సంబంధిత సమాచారం :