హార్ట్ బ్రేకింగ్ న్యూస్ : స్వర్గస్తులైన ఎస్పీ బాలు గారు.!

Published on Sep 25, 2020 1:35 pm IST

గత కొన్ని వారాల నుంచి దేశం గర్వించదగ్గ లెజెండరీ గాయకులూ ఎస్పి బాల సుబ్రహ్మణ్యం కోవిడ్ తో పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఆయన అభిమానులు సహా మొత్తం అన్ని సినీ పరిశ్రమలకు చెందిన నటులు, తారలు టెక్నీషియన్స్ ఇలా కోట్లాది మంది ఎన్నో మొక్కులు మొక్కారు. వైద్యులు కూడా తమ సర్వ శక్తులూ ఒడ్డి చికిత్స చేయడంతో మధ్యలో కోలుకున్నారు.

ఈ లోపలే ఎప్పుడు చేదు వార్త వినాల్సి వస్తుంది అని భయంతోనే అంతా గడిపారు. కానీ ఆ మహా గాయకుని అధ్యాయానికి నేటితో తెర పడింది. గత 24 గంటల కితం ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించిందని వార్తలు మొదలు కావడంతో మరోసారి అంతా ఆందోళనకు గురయ్యారు.

కానీ ఆయన ఆరోగ్య పరిస్థితికి దేహం సహకరించకపోయే సరికి ఆయన్ను కాపాడుకోలేకపోయామని వైద్యులు నిర్ధారించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచి స్వర్గస్థులయ్యారన్న వార్త రావడంతో మొత్తం సంగీత లోకంతో పాటుగా సినీ ప్రపంచం అంతా దిగ్బ్రాంతికి లోనయ్యింది.

1946 నెల్లూరులో జన్మించిన ఆయన 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలను పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా నెలకొల్పారు. అంతే కాకుండా 6 జాతీయ స్థాయి పురస్కారాలు, 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులు వరించాయి. అసలు ఆయన లేరు అనే మాటే వర్ణనాతీతం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని 123తెలుగు టీమ్ వారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతిని తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం :

More