బాలల చిత్రం ఆదిత్య సినిమాకు భారత వరల్డ్ రికార్డ్ అవార్డు

బాలల చిత్రం ఆదిత్య సినిమాకు భారత వరల్డ్ రికార్డ్ అవార్డు

Published on Aug 14, 2019 9:57 AM IST

బాలల చిత్రంగా తెరకెక్కిన ఆదిత్య సినిమాకు భారత వరల్డ్ రికార్డ్ అవార్డు దక్కింది.. ఈ అవార్డు ను గౌరవ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు మరియు భారత వరల్డ్ రికార్డ్, భారత ప్రతినిధి నరేందర్ చిత్ర దర్శకులైన భీమగాని సుధాకర్ గౌడ్ గారికి అందజేశారు.. శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ” ఆదిత్య” బాలల చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల 100 పర్సెంట్ వినోదపు పన్ను రాయితీ పొంది అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో అవార్డు కైవసం చేసుకుని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నూన్ షోస్ కు పర్మిషన్ పొంది 10 చిల్డ్రన్ ఫిలిం సొసైటిస్ ద్వారా 2015 నవంబర్ 4 నుండి ఇప్పటివరకు నూన్ షోస్ ప్రదర్శింపబడుతుంది.. అందుకు గాను ఇంతకుముందే వండర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ ను సాధించింది.. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులలో ఉత్తమ బాలల చిత్రంగా నంది అవార్డు మరియు ప్రముఖ దర్శకులు శ్రీ రాఘవేంద్రరావు గారి నాన్నగారైన శ్రీ కె.ఎస్ ప్రకాష్ రావు గారి స్మారక గోల్డ్ మెడల్ ని ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా అందుకున్నాడు.. దీనికి ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇండీవుడ్ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఫిల్మ్ కార్నివాల్ లో ఉత్తమ బాలల చిత్రం గా అవార్డు పొందింది..

భారతదేశంలోని 25 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్షింపబడి ఇంటర్నేషనల్ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి వేలాది చిత్రాలు ప్రదర్శనకు వచ్చినా అందులో 8 చిత్రాలను మాత్రమే భారత ప్రభుత్వం ఎంపిక చేసింది.. అందులో నాలుగవ చిత్రంగా “ఆదిత్య” బాలల చిత్రం ప్రదర్శింపబడింది..ప్రపంచంలో పలు దేశాలు నిర్వహించిన అంతర్జాతీయ చాల చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది.. ఈ చిత్రం 1000 డేస్ పూర్తయిన సందర్భంగా భారత వరల్డ్ రికార్డ్ అవార్డు ను సొంతం చేసుకుంది..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు