8 దేశాల్లో షూటింగ్ జరుపుకోనున్న భారతీయుడు 2 !

Published on Jan 22, 2019 10:08 am IST

కమల్ హాసన్ – శంకర్ కలయికలో సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ మొదటి షెడ్యూల్ ఇటీవల చెన్నైలో ప్రాంభమైంది. మరో రెండు వారలు అక్కడే షూటింగ్ జరిపి చిత్ర బృందం అబ్రాడ్ వెళ్లనున్నారు. ఎనిమిది దేశాల్లో లో రెండు నెలలపాటు ఈ చిత్ర షూటింగ్ ను జరుపనున్నారు. ఈచిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ ను అక్కడే తెరకెక్కించనున్నారు.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు జాక్ గిల్, టాడో గ్రిఫిత్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈచిత్రం 2020లో సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More