హిందూ టెర్రరిజం వ్యాఖ్యలపై కమల్ కు ఊరట

Published on May 15, 2019 9:00 pm IST

లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్రదుమారం రేపాయి. మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథురాం గాడ్సేని కమల్ మొదటి హిందూ తీవ్రవాదనటంతో దేశవ్యాప్తంగా ఉన్న హిందుత్వవాదులు మరియు రాజకీయనాయకులు లతో పాటు వివేక్ ఒబెరాయ్ వంటి సినీ ప్రముఖులు కూడా కమల్ ను తీవ్రంగా తప్పుబట్టారు.

మరో వైపు కమల్ ఎన్నికలలో లబ్ది పొందడానికి మతవైషమ్యాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలు చేయడం జరిగింది. దీనిపై నియమించిన జి. ఎస్ శిస్తాని మరియు జ్యోతి సింగ్ ల ఇద్దరు సభ్యుల కమిటీ ఈ పిల్ ను విచారణకు నిరాకరించడంతో కమల్ కి ఊరట లభించినట్లయింది.

సంబంధిత సమాచారం :

More