సినీ లోకమంతా ‘సైరా’కు సాహో అంటున్నారు

Published on Sep 18, 2019 8:48 pm IST

కొద్దిసేపటి క్రితమే మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ ట్రైలర్ విడుదలైంది. అనుకున్న అంచనాలను మించి ట్రైలర్ అలరించడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. చిరును, నిర్మాత రామ్ చరణ్ ను,
దర్శకుడు సురేందర్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇలా అభిమానులు పొగడటం ఎప్పుడూ ఉండేదే అయినా ఈసారి సినీ లోకమంతా ట్రైలర్ పట్ల గొప్ప ఫీడ్ బ్యాక్ ఇవ్వడం పెద్ద విశేషం.

దర్శకులు రాజమౌళి, సంపత్ నంది, అనిల్ రావిపూడి, మారుతి, సాయి రాజేష్, హరీశ్ శంకర్, సుధీర్ వర్మ ఇలా పలువురు ట్రైలర్ గొప్పగా ఉందనగా నాని, మంచు మనోజ్, అడివి శేష్, రాజ్ తరుణ్, సందీప్ కిషన్, సమంత, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్, ఫర్హాన్ అక్తర్, సుధీర్ బాబు, వెన్నెల కిషోర్ ఇలా చాలమంది ప్రసంశలు కురిపించారు.

ఇక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, పరిశ్రమల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అందరూ చిరంజీవి కష్టాన్ని, దర్శకుడు సురేందర్ రెడ్డి విజన్, నిర్మాత చరణ్ తపనను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా ట్రైలర్ సినిమా మీద అప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసేసింది.

సంబంధిత సమాచారం :

X
More