బోల్డ్ స్టిల్ తో వచ్చిన `ఇందువదన` !

Published on Jun 28, 2021 12:00 pm IST

`హ్యాపీడేస్‌`, `కొత్త బంగారు లోకం` లాంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌ సందేశ్‌ చాల గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. `ఇందువదన` అనే టైటిల్ తో ప్రస్తుతం వరుణ్ సందేశ్ సినిమా చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఇందు పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. క్లాసిక్ లుక్ లో బోల్డ్ స్టిల్ ఇస్తూ కనిపించింది హీరోయిన్ ‘ఫర్నాజ్ శెట్టి’. ఊహించని విధంగా ఉండటంతో పాటు సినిమా పై ఆసక్తిని పెంచింది ఈ లుక్.

ఇక ఈ సినిమాకి నూతన దర్శకుడు ‘ఎంఎస్‌ఆర్‌’ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. లాస్ట్ వీక్ హైద‌రాబాద్ సార‌ధి స్టూడియోస్ లో భారీగా వేసిన సెట్స్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను గ్రాండ్ గా తెరకెక్కించారు. అన్నట్టు ఈ సినిమాకు కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తున్నాడు. అలాగే శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :