గాయపడినా కూడ షూట్ వాయిదా వేయని స్టార్ హీరో

Published on Nov 24, 2020 3:00 am IST

తమిళ స్టార్ హీరో అజిత్ కొత్త చిత్రం ‘వాలిమై’ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్లో భాగంగా అజిత్ బైక్ స్టంట్స్ చేస్తుండగా ప్రమాదం జరిగి ఆయన చేతికి, వేళ్లకు గాయాలయ్యాయి. దీంతో అజిత్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం జరిగింది. ఈ ప్రమాదంతో షూటింగ్ కనీసం నెల రోజులైనా వాయిదా పడుతుందని చిత్ర యూనిట్ డిసప్పాయింట్ అయ్యారట. కానీ అనూహ్యంగా అజిత్ విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్ మొదలుపెట్టారట. దీంతో ఎలాంటి ఆలస్యం లేకుండా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతోందట.

ఇలా అజిత్ సినిమా కోసం, నిర్మాత బాగు కోసం గాయాలను కూడ లెక్క చేయకుండా సెట్స్ మీదకి రావడంతో ఆయన కమిట్మెంట్ చూసి చిత్ర బృందం అభినందనలు కురిపిస్తోంది. అజిత్ అభిమానులైతే తమ హీరో కమిట్మెంట్ గురించి మరోసారి గర్వంగా చెప్పుకుంటున్నారు. స్టంట్ కొరియోగ్రఫర్ దిలీప్ సుబ్రమణ్యం పర్యవేక్షలో అజిత్ చేస్తున్న ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకి మేజర్ హైలైట్స్ అవుతాయని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తర్వాత డిసెంబర్ మొదటి వారంలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ తరవాత ఇంకొక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంటుంది.

అది పూర్తైతే షూటింగ్ పార్ట్ ముగిసినట్టే. అజిత్, వినోత్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా తెలుగు యువ హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

More