విజయ్ కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించనున్న ‘ఇంకేంటి? నువ్వే చెప్పు’ సినిమా లవ్, కామెడీ, సస్పెన్స్ కలగలిపిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జనవరి 5నుండి మొదలుకానుంది. ఒకే షెడ్యూల్ లో సినిమా మొత్తాన్ని పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ సినిమాలో అంతర్లీనంగా ఒక సందేశం దాగుందని తెలిపాడు. తెలుగు సినిమాలో ఇప్పటివరకూ ఇటువంటి స్క్రీన్ ప్లే ఎక్కడా రాలేదని తెలిపారు. తారల వివరాలు త్వరలోనే తెలుపుతామని తెలిపారు. శివశ్రీ మేగాదా దర్శకుడు


