సరికొత్తగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ప్రమోషన్స్

సరికొత్తగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ప్రమోషన్స్

Published on Mar 8, 2015 6:52 PM IST

Yevade-Subramanyam
యంగ్ హీరో నాని సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులే అయ్యింది. దాంతో నాని వరుసగా రెండు సినిమాలను వెంట వెంటనే రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. అందులో చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ‘జెండాపై కపిరాజు’ అయితే, మరొకటి లేటెస్ట్ ఫిల్మ్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. ఇందులో ముందుగా ఉగాది కానుకగా మార్చి 21న జెండాపై కపిరాజు రిలీజ్ కానుంది. దాంతో నాని ఈ రెండు సినిమాలకు సంబంధించి సరికొత్తగా ప్రమోషన్స్ చెయ్యడానికి ప్లాన్ చేసాడు.

అందులో ముఖ్యంగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ టీం వారు ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో ముందుగా ఎక్కువ మంది స్టూడెంట్స్ తో కలిసి స్కైప్ లో చాట్ చేయనున్నాడు. తెలుగు సినిమాని ఇలా ప్రమోట్ చేయడం ఇదే ప్రధమం. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానితో పాటు విజయ్, మాళవిక నాయర్, రీతు వర్మ కలిసి నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు