ఇన్నోవేటివ్ పబ్లిసిటీతో ‘ఎవడే సుబ్రమణ్యం’

ఇన్నోవేటివ్ పబ్లిసిటీతో ‘ఎవడే సుబ్రమణ్యం’

Published on Mar 10, 2015 12:50 PM IST

Yevade-Subramanyam
ఒక చిన్న విరామం తర్వాత యువ హీరో నాని ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్, ఇంట్రడక్షన్ వీడియోలను వినూత్నంగా రూపొందించారు. సినిమాను ప్రమోట్ చేయడంలో దర్శక నిర్మాతలు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు.

తాజాగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఎక్స్‌క్లూజివ్ ప్రమోషనల్ బుక్ లేట్ విడుదల చేశారు. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ వివరాలు, షూటింగ్ సమయంలో జరిగిన సంగతులు, ఇతర వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 21న విడుదలవుతుంది.

తాజా వార్తలు