త్వరలో కొత్త సినిమా ప్రకటించనున్న హిట్ డైరెక్టర్..!

Published on Jul 8, 2020 1:08 am IST


దర్శకుడు అనిల్ రావిపూడి హిట్ ట్రాక్ లో దూసుకుపోతున్నారు. ఆయన గత రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్ 2 భారీ విజయం అందుకుంది. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఆ చిత్రం వెంకటేష్, వరుణ్ లకు భారీ విజయం అందించింది. ఇక 2020 సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు ఎంత పెద్ద విజయం సాధించిందో చూశాం. ఆ మూవీ మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు నమోదు చేసింది.

కొన్నాళ్లుగా అనిల్ రావిపూడి తన రైటింగ్ టీం తో కలిసి సొంత ఊరిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. ఆయన ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్3 మూవీని ప్రకటించగా దాని స్క్రిప్ట్ అని సమాచారం ఉంది. ఐతే లాక్ డౌన్ పరిస్థితుల వలన ఆ చిత్రం వెంటనే మొదలుపెట్టలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనిల్ ఓ స్మాల్ బడ్జెట్ మూవీ ప్రకటించనున్నారని సమాచారం అందుతుంది. ఆ సినిమాలో నటీనటులు మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నాడట అనిల్.

సంబంధిత సమాచారం :

More