సెకెండ్ హ్యాండ్ గా మారిపోయిన రాజ్ తరుణ్ ?

Published on Jul 27, 2018 10:10 am IST

‘ఉయ్యాల జంపాలా’ చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ సినిమా చూపిస్తా మావ, కుమారి 21f చిత్రాలతో మంచి విజయాలనే అందుకున్నాడు. కానీ ప్రస్తుతం రాజ్ తరుణ్ వరుస పరాజయాలతో గత కొంతకాలంగా ఇబ్బందిపడుతున్నాడు. రాజ్ తరుణ్ తాజాగా నటించిన ‘లవర్’ చిత్రం కూడా అతని కెరీర్ కు ఉపయోగపడేలా కనిపించట్లేదు. దర్శకుడు అన్నీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవర్’ చిత్రం పర్వాలేదు అనిపించుకున్న రాజ్ తరుణ్ ఖాతాలో మాత్రం హిట్ చిత్రంలా నిలబడలేపోయింది.

కాగా సినీవర్గాల సమాచారం ప్రకారం కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి రిజక్ట్ చేసిన ఓ కథను రాజ్ తరుణ్ అంగీకరించరని ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఒకప్పుడు మినిమమ్ గ్యారింటీ హీరో అనిపించుకున్న రాజ్ తరుణ్ ఈ సంఘటనతో సెకెండ్ హ్యాండ్ హీరోగా మారిపోయాడని రూమర్లు వస్తున్నాయి. మరి ఈ వార్తలకు రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :