సుకుమార్ పరిస్థితే, సుజీత్ కి ఎదురైందా…?

సుకుమార్ పరిస్థితే, సుజీత్ కి ఎదురైందా…?

Published on Sep 5, 2019 7:11 AM IST

ప్రేక్షకుల నాడి, అభిరుచి అర్థం చేసుకోవడం అనేది ప్రతి దర్శకుడి అతిపెద్ద సవాల్. ఎందుకంటే వారు తీసే చిత్రాల జయాపజయాలు దానిపైనే ఆధారపడి ఉంటాయి. అది తెలిసిన దర్శకులు వరుస విజయాలు అందుకుంటూ అగ్రస్థానం సంపాదిస్తారు. నీకేమి తెలుసు, నీ తెలివి తేటలేంది అనేది ప్రేక్షకులకు అనవసరం, వారి కావలసింది, వారు ఆశించినది నీ చిత్రంలో ఉందా లేదా అనేది ముఖ్యం.

సాహో ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటుంది. సుజీత్ వరకు నేను అద్భుత స్క్రీన్ ప్లే రాసుకున్నాను, అనే భావనలో ఉన్నారు. అందుకే సాహో లో సంక్లిష్టమైన స్క్రీన్ ప్లే అర్థం కావాలంటే మరో సారి మూవీ చూడండి అని అభ్యర్దిస్తున్నాడు. నిజానికి అది వాస్తవం కూడా. సాహో కీలకమైన మలుపులతో చివరివరకు సాగింది.తెలుగు ప్రేక్షకులకు ఫజిల్ లా అనిపించే క్లిష్టమైన స్క్రీన్ ప్లేని ఇష్టపడరు.ఏదైనా అరటిపండు వలిచి నోట్లోపెట్టినట్టు సింపుల్ గా ఉండాలి. సాహో థియేటర్ లో కూర్చున్న సాధారణ ప్రేక్షకులు మాథ్స్ రాని పూర్ స్టూడెంట్ లా ఫీల్ అవుతున్నారు.

క్లిష్టమైన స్క్రీన్ ప్లే లో ఉండే మెలికను అర్థం చేసుకొని ఎంజాయ్ చేయడం అందరికి నచ్చకపోవచ్చు. ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ మహేష్ తో చేసిన నేనొక్కడినే చిత్రానికి ఇదే పరిస్థితి ఎదురైంది.నిజానికి సుకుమార్ ఆ చిత్రం కోసం రాసుకున్న ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే తెలుగు ప్రేక్షకులకు అర్థం కాలేదు. సుకుమార్ తనకు ఎంతో పేరు తెచ్చిపెడుతుందనుకున్న నేనొక్కడినే అనూహ్యంగా విమర్శల పాలైంది. అందుకే అందరికీ అర్థమయ్యేలా ఆయన రంగస్థలం తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సాహో చిత్రం వలే నేనొక్కడినే చిత్రం కూడా రివేంజ్ డ్రామా కావడం గమనార్హం.

సాహో విషయంలో సుజీత్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు అనిపిస్తుంది. సాహో చిత్రం లో సుజీత్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ తెలుగు పేక్షకులకు నచ్చలేదు.సాహో లో విషయం అయితే ఉంది. అందుకు నిదర్శనం ఉత్తర భారత దేశంలో సాహో కి వస్తున్న ఆదరణ. సాహో లో వారికి నచ్చిన అంశం ఏమిటీ? తెలుగు ప్రేక్షకులకు నచ్చని అంశం ఏమిటీ? అని ఆలోచిస్తే అంతా చిత్రాన్ని అర్థం చేసుకోవడంలోనే, మరియు అర్థం అయ్యేలా చెప్పడంతోనే ఉంది.ఇకపైన అయినా సుజీత్ ఈ సూత్రం వంటబట్టించుకొని చిత్రాలు చేస్తే బాగుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు