నిఖిల్ నుండి ఇంటెన్స్, ఇంట్రెస్టింగ్ ప్రీలుక్

Published on May 29, 2021 1:00 am IST

యువ హీరో నిఖిల్ ‘అర్జున్ సురవరం’ విజయం తర్వాత స్పీడ్ పెంచారు. వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేశారు. వాటిలో ’18 పేజెస్’ కూడ ఒకటి. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే సుకుమార్ అందివ్వడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తికావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ మూలంగా ఆలస్యమైంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ జూన్ 1వ తేదీన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఈలోపే ప్రీలుక్ విడుదల చేశారు. లుక్ ఇంటెన్స్గా ఇంట్రెస్టింగా ఉంది. లాక్ డౌన్ పూర్తికాగానే చిత్రీకరణ మళ్లీ రీస్టార్ట్ కానుంది. నిఖిల్ సైతం ఈ సినిమా మీద మంచి హోప్స్ పెట్టుకుని ఉన్నారు. తన కెరీర్లో విభిన్నమైన చిత్రంగా నిలిచిపోతుందని నమ్ముతున్నారు. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :