చిరంజీవి డ్యూయల్ రోల్.. కొత్త వార్త !

చిరంజీవి డ్యూయల్ రోల్.. కొత్త వార్త !

Published on Jun 5, 2018 11:48 AM IST

మెగాస్టార్ చిరు ‘సైరా’ తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడని గతంలోనే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న మాటల ప్రకారం ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తారని తెలుస్తోంది. ఆయన చేయబోయే రెండు పాత్రల్లో ఒకటి ధనవంతుడైన ఎన్నారై పాత్ర కాగా మరొకటి రైతు పాత్రట.

మరి ఈ మాటలన్నీ నిజమో కాదో తెలియాలంటే కొరటాల శివ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే ముప్పై శాతం వరకు షూటింగ్ ముగించుకున్న ‘సైరా’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన భారీ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు