‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్ వివరాలను బయటపెట్టిన దేవరకొండ !

‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్ వివరాలను బయటపెట్టిన దేవరకొండ !

Published on Apr 23, 2018 3:18 PM IST


గతేడాది తెలుగు పరిశ్రమ అందుకున్న విజయాల్లో సందీప్ వంగ రూపొందించిన ‘అర్జున్ రెడ్డి’ కూడ ఒకటి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బిజీ హీరోగా మారిపోయారు. అంతేకాదు చిత్ర హీరోయిన్ షాలిని పాండే, ఇతర నటీనటులకు కూడ మంచి ఆఫర్లను దక్కాయి. ఇంతటి విజయాన్ని సాధించిన ఈ సినిమా యొక్క సీక్వెల్ పై ఇది వరకే పలు వార్తలు వినిపించాయి.

కాగా విజయ్ దేవరకొండ ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ సీక్వెల్ ఆలోచన ఉందని, దీనిపై సందీప్, తాను చర్చించుకున్నామని, ఒకవేళ సీక్వెల్ తీస్తే అందులో 40 ఏళ్ల వయసులో అర్జున్ రెడ్డి జీవితం ఎలా ఉంటుంది అనేది చూపించాలని అనుకుంటున్నామని అన్నారు. మరి అన్నీ కుదిరి ఈ సీక్వెల్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇకపోతే సందీప్ వంగ ప్రస్తుతం పలు ఆఫర్లతో తరువాతి సినిమాకు సిద్ధమవుతుండగా విజయ్ నటించిన ‘టాక్సీవాలా’ విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజా వార్తలు