బాలయ్య నెక్స్ట్ పై మరో ఆసక్తికర బజ్.!

Published on Feb 25, 2021 12:59 pm IST

లేటెస్ట్ గా నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ భారీ చిత్రం కోసం నందమూరి అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం అనంతరం మరో ఇంట్రెస్టింగ్ కాంబోను బాలయ్య ఓకే చేసేసారు.

అదే లేటెస్ట్ గా మాస్ మహారాజ్ రవితేజతో “క్రాక్” అనే సాలిడ్ హిట్ ను అందుకొని ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. మరి మాస్ మసాలా కాంబో ఇటీవలే ఫిక్స్ అయ్యింది. అయితే ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర గాసిప్సే వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం ఇప్పటికే ఈ చిత్రం టెక్నికల్ టీం ను గోపీచంద్ ఫిక్స్ చేసేశారని అలాగే ఒక ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ ఫుల్ జానర్ ను కూడా బాలయ్యకు తగ్గట్టుగా డిజైన్ చేసారని వినిపిస్తుంది. మరి ఈ డీటెయిల్స్ తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :