బన్నీ – నీల్ కాంబోపై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Mar 18, 2021 6:00 pm IST

ఇప్పుదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా “పుష్ప” తో పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టడానికి సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఇంకా ఇది లైన్ లో ఉండగానే బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో మరో భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఇక ఈ లైనప్ తోనే అనుకుంటే మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఓకే అయ్యినట్టుగా ఇటీవల టాక్ వచ్చింది. అదే కన్నడ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో.

గత కొన్ని రోజుల కితమే ఈ మాసివ్ కాంబో గురుంచి టాక్ మొదలయ్యింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మరిన్ని ఆసక్తికర టాక్ ప్రకారం ఆల్రెడీ ప్రశాంత్ నీల్ కు ఈ సినిమాకు అనుకున్న ప్రొడ్యూసర్స్ అడ్వాన్స్ ఇచ్చేశారని ఖచ్చితంగా ఈ కాంబోలో సినిమా ఉందని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ కాంబోలో సినిమా సెట్టవ్వడం ఇప్పుడు జరిగింది కాదు ఎప్పుడో అనుకున్నదే అని మరో గాసిప్ వినిపిస్తుంది. మరి ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :