చరణ్, ఎన్టీఆర్ ల సినిమాపై ఆసక్తికర కథనం !

Published on Jun 1, 2018 8:20 am IST

రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి చేయబోతున్న మల్టీస్టారర్ చిత్రంపై ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిందే. సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే అభిమానుల్లో సినిమా సందడి మొదలైపోయింది. ఇంకా రాజమౌళి పూర్తి కథను చరణ్, తారక్ లకు చెప్పకముందే సినిమా కథకు సంబదించి రకరకాల వార్తలు వినిపించాయి.

తాజాగా కూడ ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో చరణ్ పోలీసాఫిసర్ పాత్రలో కనిపిస్తారని, ఆయన సోదరుడిగా ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తారట. అంతేగాక ఈ చిత్రంలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా గొప్పగా ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ వార్తలన్నీ నిజంలో కాదో తెలియాలంటే జక్కన్న నోరు విప్పాల్సిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని రూ.300 కోట్ల బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :