పవన్ సెన్సేషనల్ కాంబోపై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Sep 1, 2021 9:13 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సాలిడ్ లైనప్ లో తన బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరి గత ఏడాది పవన్ బర్త్ డే కనుకగా ఊహించని రీతిలో అనౌన్సమెంట్ ఇచ్చిన ఈ సాలిడ్ కాంబో నుంచి మళ్ళీ ఈ ఏడాది కూడా ఓ అదిరే అప్డేట్ రానుంది అని బజ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.

మరి దీని ప్రకారం ఈ కాంబో నుంచి రేపు ఒక సాలిడ్ ప్రీ లుక్ పోస్టర్ ని మేకర్స్ లాంచ్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఈ బజ్ అయితే హాట్ హాట్ గా నడుస్తుంది. మరి ఈ చిత్రానికి పూజా హెగ్డే పేరు హీరోయిన్ గా వినిపిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :