“RRR” రిలీజ్ టైం పై ఇంట్రెస్టింగ్ బజ్..!

“RRR” రిలీజ్ టైం పై ఇంట్రెస్టింగ్ బజ్..!

Published on Aug 27, 2021 7:04 AM IST


మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పలు భారీ చిత్రాల్లో “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం ఎట్టకేలకు నిన్నటితో మొత్తం షూట్ ని కంప్లీట్ చేసుకుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.

అయితే దానితో పాటుగా రిలీజ్ డేట్ పై కూడా హింట్ ఇచ్చేసారు ఈ ఏడాదిలో అయితే రిలీజ్ కావట్లేదు అని. దీనితో ఇక కొత్త డేట్ ఎప్పుడు ఏ సమయంలో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది అన్నవి ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలు గా మారాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కి సిద్ధం చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే పలు భారీ చిత్రాలు ఆ రేస్ లో ఉన్నాయి.

కానీ టైం బాగుంటే ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి అంత కన్నా మంచి సమయం మేకర్స్ కి లేదని తెలుస్తోంది. అందుకే ఈ రేస్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్. నిజానికి అయితే ఈ ఏడాది సంక్రాంతి రేస్ లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడుతూ వస్తుంది. మరి కొత్త డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు