
సినీ ప్రియులు చాలారోజులుగా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. భారతదేశ అతిపెద్ద మోషన్ పిక్చర్ బాహుబలి సినిమా యొక్క ఆడియో విడుదల వేడుక ఈరోజు తిరుపతిలో ఘనంగా జరగనుంది. ఈ వేడుకను విజయవంతం చేసేందుకు చిత్ర బృందం భారీ కృషిచేస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు పనిచేసిన ప్రధాన తారాగణాన్ని ఒక ప్రైవేట్ ఫ్లైట్ మీద తిరుపతి తీసుకురానున్నారు. రాజమౌళి అండ్ కో ఈ రోజుని కూడా చరిత్రలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర యునివెర్సిటీ ఈ వేడుకకు వేదికగా నిలవనుంది. సుమ యాంకర్. హైదరాబాద్ లో భద్రతా కారణాల వలన ఈ వేడుక ఒకసారి వాయిదా పడిన సంగతి తెలిసినదే.