శ్రీదేవిని ఎత్తుకొని గోదారి దాటించిన దర్శకేంద్రుడు

Published on Sep 19, 2019 8:28 am IST

శ్రీదేవి, శోభన్ బాబు నటించిన ‘దేవత’ చిత్రంలోని ఎవర్ గ్రీన్ సాంగ్ “వెల్లువొచ్చి గోదారమ్మ…,” తెలుగురాష్ట్రాలలో సంచలనంగా మారింది. వరుణ్ తేజ్ తాజా చిత్రం వాల్మికీలో ఈ పాటను రీమిక్స్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు ఈ పాటను మరో మారు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఈ పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఈపాట సెట్ లోకి శ్రీదేవిని రాఘవేంద్రరావు చేతులపై మోసుకుంటూ తీసుకెళ్లేవారట.

అసలు విషయంలోకి వెళితే “వెల్లువొచ్చి గోదారమ్మ…,” పాటను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గోదావరి నదిలో గల ఇసుక దిబ్బపై చిత్రీకరించాల్సివుండగా, అక్కడకు చేరాలంటే చిత్ర యూనిట్ చిన్న నీటి పాయ దాటాల్సివచ్చేదట. శ్రీదేవి గోదావరి వొడ్డునే మేకప్ మరియు కాస్ట్యూమ్స్ తో సిద్దమైపోయేవారట. మోకాళ్లవరకు గల పరికిణీలో ఉన్న శ్రీదేవికి ఆ పాయ దాటడం సమస్యగా మారింది. దీనితో ఎవరో ఒకరు ఆమెను ఎత్తుకొని ఆ చిన్న పాయ దాటించాల్సిన పరిస్థితి. నిర్మాత రామానాయుడు హీరో శోభన్ బాబుని ఎత్తుకోమని అడుగగా…,ఆయన నా వల్లకాదన్నారట. ఇక ఆ బాధ్యత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకి తప్పలేదట. ఆ పాట చిత్రీకరణ పూర్తయిన మూడు నాలుగు రోజులు రాఘవేంద్ర రావు శ్రీదేవిని ఎత్తుకుని ఆ నీటి పాయ దాటించారట.

సంబంధిత సమాచారం :

X
More