
టాలీవుడ్ నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కోసం రాజమౌళి అండ్ టీం ఓ కొత్త భాషని కనిపెట్టారు. దానిపేరే ‘కిలికి’. ఈ సినిమాలోని కాలకేయ వార్ లార్డ్ కి సంబంధించిన భాష ఇది. ఈ భాషకి సంబందించిన డైలాగ్స్ ఎలా ఉంటాయి అనే సాంపిల్ కోసం ఇటీవలే జరిగిన ఆడియో లాంచ్ లో కాలకేయ పాత్ర పోషించిన ప్రభాకర్ చేత చెప్పించారు. ఆ డైలాగ్స్ వింటేనే మనలో భయాన్ని తెస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇంతకీ ఈ భాషని కనిపెట్టింది ఎవరు అనే విషయానికి వస్తే తమిళ లిరిసిస్ట్ మరియు డైలాగ్ రైటర్ మధన్ కార్కీ ఈ భాషని ఇన్వెంట్ చేసాడు.
మదన్ కార్కీ ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో కిలికి భాషకి సంబందించిన ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.. ‘రాజమౌళి గారు కాలకేయుల కోసం ఓ పవర్ఫుల్ మరియు మోటైన భాష కావాలన్నారు, అదికూడా వింటుంటేనే మనలో భయం కలిగేలా ఉండాలని అన్నారు. దాంతో ఈ కిలికి భాషని కనిపెట్టా. ఇందుకోసం 40 గ్రామర్ రూల్స్ తో కూడిన 750 పదాలను కనిపెట్టాం. అంతే కాకుండా షూటింగ్ స్పాట్ లో అందరూ రెఫర్ చేసుకోవడానికి కొన్ని రెఫరెన్స్ డాక్యుమెంట్స్ ని కూడా ప్రిపేర్ చేసాము. కిలికి భాషలో కొన్ని పదాలు అర్థం చేసుకోవడానికి, వాటిని పలకడం కష్టంగా ఉంటుంది. అందుకే ఆ పదాలని ఎలా పలకాలి అనేది రికార్డ్ చేసి సెట్స్ కి పంపాను. ఒకటి మాత్రం చెప్పగలను కాలేకయులు ఈ భాష మాట్లాడుతుంటే వినేవాళ్లలో భయం కలుగుతుందని’ అన్నాడు.
బాహుబలి సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ,మలయాళ , హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అన్ని భాషల్లోనూ కిలికి భాష కామన్ గా ఉంటుంది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్టర్. జూలై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

